కాకతీయ పరపతి సంఘం సభ్యుల అకాల మరణం: కుటుంబాలకు ₹30 వేల వంతున ఆర్థిక సాయం*
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
వర్ధన్నపేట: కాకతీయ పరపతి సంఘం సభ్యులు రఘుసాల వెంకటేశ్వర్లు, బొమ్మిదేని శివ కుమార్ లు అకాల మరణం పట్ల సంఘ కార్యవర్గం తీవ్ర దిగ్భ్రాంతి, సానుభూతి వ్యక్తం చేశారు.
ఆదివారం సంఘం అధ్యక్షుడు సమ్మెట శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి భానుచందర్ మృతుల నివాసాలకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మరణ విపత్తు సహాయం కింద ఇరు కుటుంబాలకు రూ. 30,000 ల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేశారు.
సంఘ సభ్యుల కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటామని, వారి ఆకస్మిక మరణం సంఘానికి తీరని లోటని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాకతీయ పరపతి సంఘం కోశాధికారి కొండ గోపాల్, సంఘ సభ్యులు కీర్తి సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.