గాంధీ ఆశయాలను ఆచరించడమే జాతిపితకు నిజమైన ఘన నివాళి

రిపోర్టర్: BHARADWAJ స్థలం: మునగాల

సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు వక్కంతుల భరత్ బాబు మాట్లాడుతూ సత్యం, అహింస మార్గాలతో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరారు. గ్రామ స్వరాజ్య స్థాపనతోనే దేశాభివృద్ధి సాధ్యమని పేర్కొంటూ ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఆయన గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.