వాతావరణ మార్పులతో చిన్నారులలో పెరుగుతున్న శ్వాసకోశ సమస్యలు

రిపోర్టర్: సతీష్ స్థలం: ఢిల్లీ

ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా చిన్నారులలో ఆస్తమా, అలెర్జిక్ రినైటిస్, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయని మదర్హుడ్ హాస్పిటల్ సీనియర్ పీడియాట్రీషియన్ డాక్టర్ మనీష్ బాల్డే తెలిపారు. ఉష్ణోగ్రతలలో ఆకస్మిక మార్పులు, గాలిలో కాలుష్యం పిల్లల సున్నితమైన వాయునాళాలపై ప్రభావం చూపుతాయని చెప్పారు. తల్లిదండ్రులు పిల్లల శ్వాస తీరును గమనించాలని, రాత్రిపూట తరచూ దగ్గితే వైద్యులను సంప్రదించాలని ఆయన హెచ్చరించారు.