ఢిల్లీలో హల్దీరామ్ భవనంలో అగ్నిప్రమాదం ముప్పై మంది సురక్షిత రక్షణ
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: ఢిల్లీ
ఢిల్లీలోని మోడల్ టౌన్ ప్రాంతంలో ఉన్న హల్దీరామ్ భవనంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు భవనం అంతటా వేగంగా వ్యాపించడంతో దట్టమైన పొగ కమ్ముకుంది. అప్రమత్తమైన స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి 23 అగ్నిమాపక యంత్రాలతో శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, సకాలంలో స్పందించి భవనంలో చిక్కుకున్న సుమారు ముప్పై మందిని సురక్షితంగా రక్షించినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.