'ఆ కమిషన్‌ నియామక ఉత్తర్వులు మా ముందుంచండి': హైకోర్టు

రిపోర్టర్: సునీల్ స్థలం: అమరావతి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. డెడికేటెడ్ కమిషన్ నియామక ఉత్తర్వులు, సమగ్ర కుటుంబ సర్వే గణాంకాలను తమ ముందుంచాలని అమరావతి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బీసీల రిజర్వేషన్లు 50% దాటడంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌ల ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.