స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ పేర్ని నాని మండిపాటు

రిపోర్టర్: నరేష్ స్థలం: మచిలీపట్నం

స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తప్పుడు మార్గాలతో ఏకగ్రీవాలు సాధించి తాము బలమంటూ బిల్డప్ ఇచ్చుకునేందుకు అధికార పార్టీ అరాచక పాలనకు తెరలేపిందని ధ్వజమెత్తారు. రిజర్వేషన్లలో అన్యాయం చేస్తూ దళితులు, బీసీలకు తీవ్ర మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.