స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిపివేత: రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం
రిపోర్టర్: సునీల్
స్థలం: అమరావతి
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిందని ఎస్ఈసి అనిల్‌చంద్ర పునేఠా వెల్లడించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అభ్యర్థుల తుది జాబితా ప్రకటనను ఈ నెల 25వ తేదీ వరకు నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. వివాదాస్పద ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని వంద పుర, నగరపాలక సంస్థలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని ఆయన స్పష్టం చేశారు.