నీటి సరఫరా వివాదం: పంచాయతీ ప్రెసిడెంట్ దారుణ హత్య
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: తమిళనాడు
తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా కన్ననల్లూరులో దారుణం జరిగింది. తాగునీటి సరఫరా విషయంలో తలెత్తిన వివాదంతో పంచాయతీ ప్రెసిడెంట్ మహారాజన్ (68)ను ఇసైకియప్పన్ అనే వ్యక్తి ఇటుకతో కొట్టి చంపాడు. నిందితుడు తన ఇంటికి నీరు రావడం లేదని వాదిస్తూ ప్రెసిడెంట్‌తో గొడవకు దిగి, ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.