అసారాం బాపుకు గుజరాత్ హైకోర్టులో బిగ్ షాక్

రిపోర్టర్: శివ స్థలం: అహ్మదాబాద్

అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను చూసేందుకు ఆశారాం బాపుకు ఇరవై రోజుల తాత్కాలిక బెయిల్ ఇచ్చేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు న్యాయమూర్తులు గీతా గోపీ, ఎల్ఎస్ పీర్జాదాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. జోధ్పూర్ జైలులో ఉంటున్న ఆశారాం తన సతీమణిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలకరించేందుకు జైలు సూపరింటెండెంట్ను ఆశ్రయించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. ఆమె ఆరోగ్యం మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు.