గ్రీన్ లాంటెన్ రూపంలో ట్రంప్.. వైట్‌హౌస్ ఏఐ వీడియో వైరల్!

రిపోర్టర్: వెంకట్ స్థలం: United States

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను డీసీ కామిక్స్ సూపర్ హీరో గ్రీన్ లాంటెన్‌గా చిత్రీకరిస్తూ వైట్‌హౌస్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఏఐ వీడియో తీవ్ర చర్చనీయాంశమైంది. సరిహద్దు గోడ నిర్మాణం, అమెరికన్ మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్‌తో కూడిన ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రభుత్వ అధికారిక ఖాతాను మీమ్ పేజీలా మారుస్తున్నారంటూ సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.