ఏపీలో 41 పురపాలక సంస్థల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియ షురూ

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: ఆంధ్రప్రదేశ్

హైకోర్టు తీర్పుతో ఏపీలో స్థానిక ఎన్నికలకు మార్గం సుగమమైంది. రాష్ట్రంలోని 41 పుర, నగరపాలక సంస్థల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియను 10 రోజుల్లో పూర్తి చేయాలని పురపాలకశాఖ ఆదేశించింది. ఈ నెల 14న తుది నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇప్పటికే 59 చోట్ల ప్రక్రియ పూర్తికాగా, మిగిలిన చోట్ల కూడా వేగంగా పూర్తి చేసి ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.