రైతులను ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయన్న మంత్రి జూపల్లి కృష్ణారావు

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

జూరాల ప్రాజెక్టులో నీటి ఎద్దడి దృష్ట్యా ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు మొదటి నుంచీ చెప్తున్నామని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ లబ్ధికే ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. ఎల్‌ నినో కరువు నేపథ్యంలో అదనంగా రూ.20 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు.