కాశిబుగ్గలో ఏడు కోట్లతో వ్యాపారి పరార్ కావడం కలకలం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వరంగల్
వరంగల్ నగరంలోని కాశిబుగ్గ 19వ డివిజన్‌కు చెందిన ఓ వ్యాపారి సుమారు రూ.7 కోట్లతో పరారైనట్లు స్థానికంగా తీవ్ర కలకలం రేగుతోంది. కిరాణా వ్యాపారంతో పాటు నెలవారీ చిట్టీలు, రియల్ ఎస్టేట్ రంగాలు నిర్వహిస్తున్న సదరు వ్యాపారి వద్ద పలువురు బాధితులు పెద్ద మొత్తంలో చిట్టీల డబ్బులు డిపాజిట్ చేయడంతో పాటు అప్పులు ఇచ్చినట్లు తెలుస్తోంది. గత నెల 25వ తేదీ నుంచి వ్యాపారి ఇల్లు వదిలి అదృశ్యం కావడంతో బాధితులు తీవ్ర ఆందోళన చెందుతూ పోలీసులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.