ఫిబ్రవరిలో సీబీఎస్ఈ పదవ తరగతి బోర్డు పరీక్షల నిర్వహణ
రిపోర్టర్: నరేష్
స్థలం: న్యూఢిల్లీ
దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ పదవ మరియు పన్నెండవ తరగతి బోర్డు పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెల్లడించింది. ఈ పరీక్షల కోసం దేశ విదేశాల నుంచి సుమారు నలభై నాలుగు లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. పరీక్షల షెడ్యూల్ మరియు టైమ్‌టేబుల్‌ను త్వరలోనే అధికారిక వెబ్సైట్లలో విడుదల చేస్తామని స్పష్టం చేశారు.