జూరాల ప్రాజెక్టు ముట్టడికి యత్నం ఉమ్మడి మహబూబ్ నగర్ లో ఉద్రిక్తత
రిపోర్టర్: సతీష్
స్థలం: మహబూబ్నగర్
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ చేపట్టిన ప్రాజెక్టు ముట్టడి పిలుపుతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని వనపర్తిలోని ఆయన నివాసంలో పోలీసులు ముందస్తుగా గృహనిర్బంధం చేశారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించి నాయకులను అడ్డుకుంటున్నారు.