యువకుడిపై బీర్ బాటిల్తో దాడి: వెంకటాచలం మండలంలో వైరల్ వీడియో కలకలం
రిపోర్టర్: sai
స్థలం: వెంకటాచలం
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో అంకయ్యపై నలుగురు యువకులు బీర్ బాటిల్ పగలగొట్టి దాడి చేసిన వీడియో సోమవారం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. ఈ ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సీఐ అంకమ్మరావు తెలిపారు.