వర్ధన్నపేటలో బాలుడి ప్రాణాలు కాపాడిన యువకుల మానవత్వం
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
వర్ధన్నపేట బస్టాండ్లో సాగరం గ్రామానికి చెందిన రెండున్నరేళ్ల బాలుడికి అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో స్థానికులు ఆందోళన చెందారు. పరిస్థితిని గమనించిన ముంజ కృష్ణ, గోధుమల విక్రమ్ అనే యువకులు వెంటనే స్పందించి బాలుడిని ఆటోలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
వైద్యులు సకాలంలో చికిత్స అందించడంతో బాలుడు ప్రాణాపాయం నుంచి బయటపడి కోలుకున్నాడు. సమయస్ఫూర్తితో వ్యవహరించి బాలుడి ప్రాణాలు కాపాడిన యువకుల మానవత్వాన్ని స్థానికులు అభినందించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.