పిల్లల్లో ప్లేట్లెట్స్ తగ్గితే ఆందోళన వద్దు: వైద్య నిపుణుల కీలక సూచనలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: Hyderabad

పిల్లల రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గడం చూసి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సకాలంలో తగిన వైద్య చికిత్స అందిస్తే ఈ సమస్యను సులభంగా తగ్గించవచ్చని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ పిడియాట్రిక్ హిమటాలజిస్ట్ డాక్టర్ నల్లా అనురాగ్ రెడ్డి స్పష్టం చేశారు. సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్లు, రోగ నిరోధక శక్తి సమస్యల వల్ల ప్లేట్లెట్స్ తగ్గుతుంటాయని, లక్షణాలను బట్టి వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయించి చికిత్స తీసుకోవాలని ఆయన తెలిపారు.