ఎన్నికల ప్రచారం: సామాజిక మాధ్యమాల వేదికగా అభ్యర్థుల డిజిటల్ క్యాంపెయిన్

రిపోర్టర్: మహేష్ స్థలం: నెల్లూరు

నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో నెల్లూరు జిల్లాలో అభ్యర్థులు డిజిటల్ ప్రచారంపై దృష్టి సారించారని అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా ఇంటింటికి తిరగడం కష్టంగా మారడంతో సోషల్ మీడియా వేదికగా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాట్సప్ గ్రూపులు, ఫేస్బుక్ లైవ్లు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా తమ హామీలను వివరిస్తూ యువతను, ప్రజలను ప్రచారంలో తమవైపు తిప్పుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలిపారు.