యూపీఐ లావాదేవీలపై ఎన్పీసీఐ కీలక ప్రకటన, ఛార్జీల పెంపు
రిపోర్టర్: నరేష్
స్థలం: భారతదేశం
యూపీఐ లావాదేవీలపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. రూ.2 వేలు దాటిన వ్యక్తి-వ్యాపారి లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ వర్తిస్తుందని తెలిపింది. ఈ ఛార్జీలు అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే సాధారణ వినియోగదారుల యూపీఐ లావాదేవీలు యథావిధిగా ఉచితంగానే కొనసాగుతాయని, రూ.2 వేలలోపు చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు ఉండవని స్పష్టంచేసింది.