ఫ్లైదుబాయ్ విమాన ప్రమాదం: ప్లంబర్ సాహసంపై స్పందించిన పైలట్ స్మిత్

రిపోర్టర్: కిరణ్ స్థలం: దుబాయ్

ఫ్లైదుబాయ్ విమానాన్ని ఓ ప్లంబర్ తన సమయస్ఫూర్తితో కాపాడారంటూ వస్తున్న వార్తలపై ఆ విమాన పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ తాజాగా స్పందించారని ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది. ఆ ప్లంబర్ గురించిన కనీస సమాచారం కూడా తనకు తెలియదని ఆయన తేల్చిచెప్పారు. విమానంపై దాడి జరిగినప్పుడు కూలిపోకుండా కాపాడేందుకే సర్వశక్తులు ఒడ్డానని, యూఏఈలో చికిత్స పొందుతున్న స్మిత్ మచ్చర్ స్పష్టం చేశారు.