మున్సిపల్ పదవి కోసం ప్రియురాలిని వివాహం చేసుకున్న టీడీపీ నేత
రిపోర్టర్: కిరణ్
స్థలం: సాలూరు
సాలూరు మున్సిపల్ చైర్పర్సన్ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతో టీడీపీ నేత హర్షవర్ధన్ తన ప్రియురాలు మంజీరను గుడిలో వివాహం చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. అయితే కూటమి పొత్తులో భాగంగా ఆ స్థానం జనసేన పార్టీకి కేటాయించడంతో పాటు, స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగిన ఆయన భార్య ఎన్నికల్ లో ఓటమిపాలయ్యారు. పదవి కోసం పెళ్లి చేసుకున్నప్పటికీ చివరకు భంగపాటు ఎదురుకావడంతో ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.