మల్కాజిగిరిలో పార్కింగ్ వివాదం: బ్లేడ్ తో దాడి చేసిన ముగ్గురు అరెస్ట్

రిపోర్టర్: రాజేష్ స్థలం: మల్కాజిగిరి

మల్కాజిగిరి మౌలాలి ఉల్ఫత్ నగర్ లో పార్కింగ్ వివాదం తీవ్రరూపం దాల్చిందని, ఇళ్ల ముందు మోటార్ సైకిళ్లు పార్క్ చేయడంపై జరిగిన వాగ్వాదంలో ఓ వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు బ్లేడ్ తో దాడి చేసి గాయపరిచారని పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టి నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు మల్కాజిగిరి పోలీసులు వెల్లడించారు.