'దసరా బరిలో రణబాలి': విజయ్ దేవరకొండ సినిమా షూటింగ్ పూర్తి
రిపోర్టర్: సునీల్
స్థలం: తెలంగాణ
టూ టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా 'రణబాలి' సినిమా షూటింగ్ పూర్తిగా పూర్తయింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని అక్టోబర్ 16న దసరా కానుకగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ విలన్గా నటిస్తుండగా, అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.