పోలాండ్ సరిహద్దు సమీపంలో రష్యా డ్రోన్ బీభత్సం
రిపోర్టర్: నరేష్
స్థలం: World
ఉక్రెయిన్‌లోని పోలాండ్ సరిహద్దుకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో రష్యా డ్రోన్ ప్రయాణికుల రైలు లోకోమోటివ్‌ను ఢీకొట్టింది. కైవ్ నుండి వార్సా వెళ్తున్న రైలుపై జరిగిన ఈ దాడిలో ప్రాణనష్టం తప్పింది. సరిహద్దు సమీపంలోని పెట్రోల్ బంక్‌పై కూడా డ్రోన్ దాడి జరగడంతో భారీగా మంటలు చెలరేగాయి. నాటో సరిహద్దుకు అతి సమీపంలో ఈ దాడులు జరగడం ఐరోపా దేశాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.