ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీగా పెరిగిన బియ్యం ధరలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: కర్నూలు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో నంద్యాల సోన, కర్నూలు సోనా బియ్యం ధరలు గత మూడు నెలల్లో భారీగా పెరిగాయి. 50 కేజీల బియ్యం బస్తాపై ఏకంగా వెయ్యి రూపాయలకు పైగా పెరుగుదల నమోదైంది. వరి సాగు తగ్గడం, మార్కెట్‌కు వడ్ల సరఫరా క్షీణించడంతో పాటు డిమాండ్ కొనసాగడం వల్లనే ధరలు విపరీతంగా పెరుగుతున్నట్లు వ్యాపార వర్గాలు వెల్లడించాయి.