హైదరాబాద్లో ఇప్పటికీ కొనసాగుతున్న వినాయక విగ్రహాల నిమజ్జన ప్రక్రియ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనాల సందడి ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ముగిసి రెండు రోజులు గడిచినా, ఎన్టీఆర్ మార్గ్ మరియు పీపుల్స్ ప్లాజా వద్ద విగ్రహాల నిమజ్జనాలు జరుగుతున్నాయి. హుస్సేన్సాగర్లో ఇప్పటివరకు మొత్తం అరవై ఆరు వేల వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం ఉదయానికి సుమారు నూట యాభై నుంచి రెండు వందల విగ్రహాలు క్యూలో ఉన్నాయని, మిగిలిన విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యే వరకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.