బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు ఎత్తివేయాలని రాస్తారోకో

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఖమ్మం రూరల్

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ప్రభుత్వం నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ ఖమ్మం రూరల్ మండలంలో ఆందోళనలు మిన్నంటాయి. మండల అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు సూర్యాపేట రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను నిరసిస్తూ కార్యకర్తలు నినాదాలు చేశారు. అక్రమ కేసులు బనాయించి ప్రతిపక్షాలను భయపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని నాయకులు హెచ్చరించారు. ఈ ఆందోళనతో రహదారిపై వాహనాల రాకపోకలకు కొంతసేపు అంతరాయం కలిగింది.