వర్షాలు లేక అల్లాడిన వైనం.. కొళాయి నీటితో దూడల దాహం తీరుస్తున్న వైనం!
రిపోర్టర్: G Satyam🌹
స్థలం: చింతపల్లి
అల్లూరి జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయితీ పరిధిలోని వీరవరం ప్రాంతంలో వర్షాలు లేక నీరు లేక ఆవు దూడలు పడుతున్న ఇబ్బందులు కంటతడి పెట్టిస్తున్నాయి. గొల్ల కాపర్లు పశువులను మేతకు తీసుకెళ్లిన సమయంలో గడ్డలు గడ్డలుగా మారిన నేలలపై చుక్క నీరు కూడా దొరకకపోవడంతో, కొళాయి నుంచి వస్తున్న స్వల్ప నీటితో దూడలు తమ దాహాన్ని తీర్చుకుంటున్న దృశ్యాలు స్థానికంగా కలచివేస్తున్నాయి.
ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల కారణంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తాగునీటి వసతి కల్పించాలని గొల్ల కాపర్లు, గ్రామస్థులు కోరుతున్నారు.