మూడు నెలల తర్వాత భార్యను చూసి కన్నీరుమున్నీరైన భర్త
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
నర్సంపేటలో మతిస్థిమితం కోల్పోయి తప్పిపోయిన భార్యను మూడు నెలల తర్వాత చూసిన భర్త కన్నీరుమున్నీరయ్యాడు. రోడ్డు పక్కన దీనస్థితిలో ఉన్న ఆమెను గుర్తించిన భర్త, ఆమెను హృదయానికి హత్తుకుని చిన్నపిల్లాడిలా రోదించాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా వారి మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమ బంధం చెక్కుచెదరలేదని ఈ ఘటన నిరూపించింది. ఈ హృదయవిదారక దృశ్యం అక్కడున్న స్థానికులను సైతం ఎమోషనల్ కి గురిచేసింది.