క్రీడాకారులపై వైకాపా కక్షసాధింపు చర్యలు తగదు: ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి

రిపోర్టర్: కృష్ణ స్థలం: వైఎస్సార్ కడప

కష్టపడి పతకాలు సాధించి ఉద్యోగాలు పొందిన క్రీడాకారులపై వైకాపా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. కడపలో విలేకర్లతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో జగన్‌, మంత్రుల చేతులమీదుగా అవార్డులు అందుకున్న అర్హులైన క్రీడాకారులను నేడు నకిలీలంటూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. వైకాపా హయాంలో ఇచ్చిన జీవోలు, పురస్కారాలు ఇప్పుడు నకిలీవా అంటూ తీవ్రస్థాయిలో ప్రశ్నించారు.