తిరుపతి జిల్లాలో వైభవంగా గ్రామశక్తి పోలేరమ్మ జాతర

రిపోర్టర్: రాజేష్ స్థలం: తిరుపతి

తిరుపతి జిల్లా వెంకటగిరిలో గ్రామశక్తి పోలేరమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. గురువారం తెల్లవారుజామున అమ్మవారి విగ్రహాన్ని జీనుగుల వారి వీధి నుంచి గుడి వద్దకు ఘనంగా తీసుకొచ్చారు. అప్పటి నుంచి భక్తజనం దర్శనాలకు పోటెత్తారు. మూడు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. సాయంత్రం జరిగే అమ్మవారి విరూపోత్సవంతో జాతర ముగియనుంది. ఈ పండుగకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.