'కిడ్నాప్ అనుకుని దాడి చేశారు': బెంగళూరులో కులాంతర వివాహం చేసుకున్న యువతి ఉదంతం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Bengaluru
కర్ణాటక రాజధాని బెంగళూరులోని మగాడి రోడ్డులో కిడ్నాప్ యత్నంగా భావించి స్థానికులు కొంతమంది వ్యక్తులపై దాడి చేసి కారును ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపింది. కులాంతర వివాహం చేసుకుని రాజస్థాన్ నుంచి వచ్చిన యువతిని ఆమె కుటుంబ సభ్యులు తీసుకెళ్తుండగా కిడ్నాప్ అనుకుని ప్రజలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తొమ్మిదేళ్ల చిన్నారితో సహా ఆరుగురు గాయపడగా, తీవ్రంగా గాయపడిన మహిళను ఐసీయూకి తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.