గజపతినగరం నియోజకవర్గంలో ముప్పై నాలుగు కోట్ల అభివృద్ధి పనులు

రిపోర్టర్: సురేష్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా జామి మండలం కుమారం గ్రామంలో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. కుమారంలో ఇరవై ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గజపతినగరం నియోజకవర్గానికి ముప్పై నాలుగు కోట్ల నిధులు కేటాయించామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గ్రామాల్లో ప్రజలకు పూర్తిస్థాయిలో సదుపాయాలు కల్పిస్తున్నారని వివరించారు. కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.