ప్రయాణికులకు షాక్: ఎమిరేట్స్ ఎయిర్లైన్స్, యాత్రా ఆన్ లైన్ కు భారీ జరిమానా

రిపోర్టర్: సునీల్ స్థలం: Chandigarh

దుబాయ్ వరదల సమయంలో విమానం ఎక్కనివ్వని ఘటనలో ఎమిరేట్స్ ఎయిర్లైన్స్, యాత్రా ఆన్ లైన్లదే తప్పని చంఢీగర్ వినియోగదారుల కమిషన్ స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం సేవా లోపమేనని కమిషన్ తేల్చిచెప్పింది. ఈ మేరకు బాధితులకు నష్టపరిహారంగా లక్షా ఎనభై ఎనిమిది వేల రూపాయలు, దావా ఖర్చులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.