పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యాచరణ
రిపోర్టర్: రాము
స్థలం: ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు లేని పేదలకు యాజమాన్య హక్కు పత్రాలు అందించేందుకు రెవెన్యూ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. నవంబర్లో భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు రూ. 1,800 కోట్లతో 4,800 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. అక్టోబర్ నాటికి అర్హుల తుది జాబితాను ఖరారు చేయనున్నారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున స్థలాలు కేటాయించనున్నారు.