అమెరికా వీసా ఉన్నవారికి కీలక అలర్ట్: ఐ-94 నిబంధనలపై స్పష్టత ఇచ్చిన నిపుణులు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: అమెరికా

అమెరికా వెళ్లిన తర్వాత వీసా స్టేటస్ను మార్చుకోవాలనుకునే భారతీయులు కొన్ని కీలక నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఇమ్మిగ్రేషన్ నిపుణులు స్పష్టం చేశారు. పాస్పోర్ట్లోని వీసా స్టిక్కర్ గడువు కంటే ఫారమ్ ఐ-94 గడువే అత్యంత కీలకమని, దరఖాస్తు పెండింగ్లో ఉన్నప్పుడు పాత నిబంధనలే వర్తిస్తాయని తెలిపారు. అందరికీ ఈ మార్పు అవకాశం ఉండదని, నిబంధనలు ఉల్లంఘించకుండా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.