అమెరికా రాజకీయాల్ లో సంచలనం: సెనేట్ ఎన్నికల్ లో అబ్దుల్ ఎల్ సయేద్ విజయం
రిపోర్టర్: వెంకట్
స్థలం: Michigan
అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో జరిగిన సెనేట్ ఎన్నికల్ లో అబ్దుల్ ఎల్ సయేద్ చారిత్రక విజయం సాధించారని న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మమ్దాని వెల్లడించారు. ట్రంప్ మద్దతునిచ్చిన రిపబ్లికన్ అభ్యర్థి మైక్ రోజర్స్ను ఓడించి యూఎస్ సెనేట్ కు ఎన్నికైన తొలి ముస్లింగా ఎల్ సయేద్ రికార్డు సృష్టించారని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య రక్షణ, జీవన వ్యయంపై ఎల్ సయేద్ చేసిన పోరాటమే ఈ అద్భుత విజయానికి కారణమని మేయర్ ప్రశంసించారు.