అంతర్జాతీయ మార్కెట్ లో భగ్గుమన్న ముడి చమురు ధరలు: పెరిగిన ఉద్రిక్తతలు
రిపోర్టర్: విజయ్
స్థలం: Washington
అమెరికా దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు మళ్లీ పెరిగినట్లు మార్కెట్ నిపుణులు తెలిపారు. ఇరాన్ కు చెందిన కేశ్మ్ దీవిపై అమెరికా దాడులు నిర్వహించిందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయనే ఆందోళనలతో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర స్వల్పంగా పెరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.