మలయాళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్న టాలెంటెడ్ డైరెక్టర్ సూర్య తేజ
రిపోర్టర్: సురేష్
స్థలం: కేరళ
భారత సినీ రంగంలో విభిన్న చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మలయాళ చిత్ర పరిశ్రమలోకి టాలెంటెడ్ డైరెక్టర్ సూర్య తేజ అడుగుపెట్టనున్నారు. తెలుగులో ఫోకస్, కన్నడంలో కృష్ణ నీ బాగానే బారో చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన, త్వరలో మలయాళంలో ఒక స్టార్ హీరోతో భారీ సినిమాను తెరకెక్కించనున్నారు. అతి త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుండగా, చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడికానున్నాయి.