వినాయక నిమజ్జనంలో భద్రతా ప్రమాణాలు పాటించాలన్న జన్నారం ఎస్సై

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా లోతైన ప్రాంతాలకు వెళ్ళవద్దని జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ ప్రజలను హెచ్చరించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో పోలీసులు సూచించిన ప్రాంతాల్లోనే నిమజ్జనం చేయాలని కోరారు. వాగులు, వంకలు, నదుల్లో ప్రమాదకర లోతైన ప్రాంతాలకు వెళ్ళవద్దని, నిమజ్జనానికి చిన్నారులను వెంట తీసుకురావద్దని సూచించారు. విద్యుత్ వైర్ల వద్ద అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై ప్రజలకు విజ్ఞప్తి చేశారు.