'పిల్లలకు పురుగుల మందు తాపించి తండ్రి ఆత్మహత్య': ఎన్టీఆర్ జిల్లాలో విషాదం

రిపోర్టర్: గోపి స్థలం: ఎన్టీఆర్ జిల్లా

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామంలో గుండెలను పిండేసే తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలానికి చెందిన రైతు పుసులూరి శ్రీనివాసరావు పొలం వద్ద కూతురు లాస్య, కొడుకు నిఖిల్‌లకు కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలిపి తాపించి, తాను కూడా తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో తండ్రి శ్రీనివాసరావు, కూతురు లాస్య మృతి చెందగా, తీవ్ర పరిస్థితిలో ఉన్న కొడుకు నిఖిల్ హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా ఈ దారుణ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.