యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఆట అద్భుతమంటూ ధ్రువ్ జురెల్ ప్రశంసలు

రిపోర్టర్: శివ స్థలం: New Delhi

కేవలం పదిహేనేళ్ల వయసులో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఆడుతున్న తీరు ఎంతో అద్భుతమని, అతడి ఆటను పోల్చలేమని భారత క్రికెటర్ ధ్రువ్ జురెల్ పేర్కొన్నారు. ఆకాశ్ చోప్రా నిర్వహించిన పోడ్కాస్ట్లో జురెల్ మాట్లాడుతూ, సూర్యవంశీ బ్యాటింగ్ శైలి ఊహకందనంత అద్భుతంగా ఉంటుందని, పవర్ప్లేలో అతడు చేసే బ్యాటింగ్ తమలాంటి ఇతర బ్యాటర్లకు ఎంతో సులువు చేస్తుందని తెలిపారు. సూర్యవంశీ ప్రతిభకు ఎవరితోనూ పోలిక లేదని ఆయన వెల్లడించారు.