మండల ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార కార్యక్రమంలో సర్పంచ్ విజయలక్ష్మి

రిపోర్టర్: KOLA MAHESH స్థలం: నారాయణపురం

సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార వేడుకల్లో గ్రామ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి పాల్గొని ఉపాధ్యాయులను అభినందించారు. విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రమోద్, ఎస్సై సీతా పాండు, ఎంఈఓ గోలి శ్రీనివాసులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.