మహిళా ఎమ్మెల్యేలపై దాడి ఘటనపై ఢిల్లీలో సబితా ఇంద్రారెడ్డి ఫిర్యాదు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: New Delhi
తెలంగాణ అసెంబ్లీ ముట్టడిలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దాడిని నిరసిస్తూ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఢిల్లీలో జాతీయ మహిళా, మానవ హక్కుల కమిషన్లకు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే తమపై హేయమైన దాడి జరిగిందని, మహిళా ప్రజాప్రతినిధులని కూడా చూడకుండా జుట్టు పట్టుకుని లాగడం దుర్మార్గమని మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేతలకు లేఖ రాస్తామని హెచ్చరించారు.