గణపవరంలో దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు నిందితుల అరెస్ట్
రిపోర్టర్: అశోక్
స్థలం: గణపవరం
ఏలూరు జిల్లా గణపవరం పోలీసులు పలు జిల్లాల్లో ఇంటి దొంగతనాలు, బైక్ చోరీలకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి నాలుగు బైక్‌లతో పాటు బంగారు, వెండి ఆభరణాలు కలిపి మొత్తం ఆరు లక్షల తొంబై వేల రూపాయల విలువైన చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు తమ ఆస్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.