పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం.. జాగింగ్‌కు వెళ్లిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: మహారాష్ట్ర

మహారాష్ట్రలోని పూణేలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 48 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వీరేంద్ర ద్వివేది దుర్మరణం చెందారు. ఉదయం జాగింగ్‌కు వెళ్లిన ఆయనను అతివేగంగా దూసుకొచ్చిన కారు తీవ్రంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయారు. నిందితుడైన 19 ఏళ్ల కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.