బీఆర్ఎస్ సంచలన నిర్ణయం: ఉభయ సభలకు త్రీ-లైన్ విప్ జారీ
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
తెలంగాణలో రేపు జరగనున్న శాసనసభ, శాసనమండలి సమావేశాల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ సభ్యులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని త్రీ-లైన్ విప్ జారీ చేసింది. పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తే ఎమ్మెల్సీ తాతామధుపై అనర్హత వేటు పడే అవకాశం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.