యూపీ సీఎం యోగీని కలిసిన 'హనుమాన్ అంశ్' చిత్ర బృందం
రిపోర్టర్: రాము
స్థలం: Uttar Pradesh
నీమ్ కరోలీ బాబా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'హనుమాన్ అంశ్' చిత్రం భారీ విజయం సాధించడంతో, దర్శకుడు విశాల్ చతుర్వేది, నటుడు శోభినావ్ సత్యా సహా చిత్ర బృందం లక్నోలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. బాక్సాఫీస్ వద్ద రూ. 143 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రంపై సీఎం ప్రశంసలు కురిపించారు. త్వరలో ఈ సినిమా అంతర్జాతీయంగా విడుదల కానుంది.