రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలకు రంగం సిద్ధం

రిపోర్టర్: శివ స్థలం: Rajasthan

రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్సీఏ) ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. సెప్టెంబర్ 29న ఆర్సీఏ అకాడమీలో వార్షిక సర్వసభ్య సమావేశంతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏకే పాండేను ఎన్నికల అధికారిగా నియమించారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల యూనిట్లతో పాటు మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లకు ఓటింగ్ జాబితాలో చోటు దక్కింది.